మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ చివరి రోజు కావడం వల్ల ప్రముఖుల తాకిడి ఎక్కువే ఉంది. సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుని, నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం వెళ్లారు.
ఇవీ చూడండి: ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం