ప్లాస్టిక్ రహిత మేడారం జాతరలో భాగంగా ములుగు జిల్లా గట్టమ్మ ఆలయ పరిసరాల్లో 20 అడుగుల ప్లాస్టిక్ కాలకేయ బొమ్మను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులతో రూపొందించిన కాలకేయ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించే ప్లాస్టిక్‌ను జిల్లా నుంచి పారద్రోలేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
జాతరకొచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావటం వల్ల... పర్యావరణానికి హాని కలుగుతుందని... దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుంకే కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు. జాతర ప్లాస్టిక్ రహితంగా జరిగేలా అందరూ సహకరించాలంటున్న కలెక్టర్ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి...
ఇవీచూడండి: బయో డైవర్సిటీ పైవంతెనలో లోపాలు లేవు: లోకేష్ కుమార్