ములుగు, భూపాలపల్లి జిల్లాలలోని రెవెన్యూ కోర్టు కేసులకు సంబంధించిన భూసమస్యలపై ఉన్న పెండింగ్ రికార్డులను వెంటనే పూర్తి చెేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సివిల్ కోర్టు కేసులు నెల రోజులలో పూర్తి కావాలన్నారు. భూసమస్యలపై ములుగు, భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు కలెక్టర్ శ్రీమతి కె.స్వర్ణలత, ములుగు అదనపు కలెక్టర్ ఆదిత్య సురభి, ములుగు జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా మోదీ