ETV Bharat / state

'బాధితులకు.. డబుల్ బెడ్ రూమ్​లు మంజూరు చేయండి' - బాధితులకు ఆర్థిక సాయం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో... అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన పలువురికి.. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్​లు మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు కుమారస్వామి కోరారు. తక్షణ సాయంగా బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

fire accident
అగ్ని ప్రమాదంలో ఇళ్లు
author img

By

Published : Apr 2, 2021, 4:43 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో... అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన పలువురికి.. జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు కుమారస్వామి నిత్యావసరాలను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు.. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్​లు మంజూరు చేయాలని కోరారు.

ఎమ్మెల్యే సీతక్క సూచనలతో.. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు వంట సామాగ్రి, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసినట్లు కుమారస్వామి వివరించారు. ప్రభుత్వం.. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 50వేలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ మౌనికతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.