ములుగులో కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యటించి.. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వీధుల వెంట తిరుగుతూ పారిశుద్ధ్య పనులు, నీటి నిల్వ ఉన్న గుంతలను త్వరగా పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. వర్ష కాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు.. నీటి నిల్వ ఉండకుండా పట్టణ కేంద్రంలో కాల్వలు, నీటి గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు.
పందుల వల్ల రోగాలు విజృంభిస్తాయని.. వాటిని ఊరికి దూరంగా ఉంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. దోమలు రాకుండా ముందస్తుగానే.. మందులు పిచికారి చేయాలని కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లి మురికి నీరు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్