ములుగు జిల్లా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చానన్న ఎమ్మెల్యే.. జాతర ఏర్పాట్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వనదేవతల జాతరను చక్కగా నిర్వహించామని.. ప్రస్తుతం జాతరలో నిర్వహణా లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం జాతర సమయంలో నిధులను విడుదల చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాక.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం-10 మంది మృతి