మేడారం జాతర దగ్గర పడుతుండటం వల్ల జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యవేక్షించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సమస్య తలెత్తకుండా నిర్మించిన వాటర్ ట్యాంకును మంత్రులు ప్రారంభించారు.
భవిష్యత్తులో వంద ఎకరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, మేడారాన్ని గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అడ్డాగా మారుస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సమ్మక్క సారలమ్మలను మామూలు దేవుళ్ల మాదిరిగా ప్రతిరోజు పూజించాలన్నారు. రెండేళ్లకోసారి జాతరను ఘనంగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. మేడారం హంపీ థియోటర్ వద్ద గిరిజనుల సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. గిరిజనులు వేషదారణతో నృత్యాలు చేసి సందడి చేశారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.
ఇదీ చూడండి : విద్యుద్దీప కాంతుల్లో.. మేడారం జాతర.!