కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను రాష్ట్ర నేతల బృందం కలిసింది. దిల్లీకి వెళ్లిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాఠోడ్, ఎంపీలు బండ ప్రకాశ్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని 'యూనెస్కో వరల్డ్ హెరిటేజ్' స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని నేతల బృందం విజ్ఞప్తి చేసింది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా ప్రకటించేందుకు అవసరం అయిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మంత్రుల బృందం కోరింది.
ఇదీ చూడండి: జలవిహార్‌లో సరికొత్త ఆఫర్.. అది వేసుకుంటేనే..