ETV Bharat / state

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

Minister seethakka on Prajapalana in Mulugu : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల పథకాల కోసం గ్రామస్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

Minister Seethakka Prajapalana Meeting
Minister seethakka on Prajapalana in Mulugu
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 9:19 PM IST

Minister seethakka on Prajapalana in Mulugu : ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట మండలం రాఘవపట్నం వద్ద భారీ వర్షాలకు కొట్టుకుపోయిన దయ్యాల వాగు బ్రిడ్జి ఇరువైపుల రోడ్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్ పరిశీలించారు. వచ్చే సంవత్సరం జరగబోయే మేడారం జాతర సందర్భంగా రోడ్డు మర్మమతులు త్వరగా చేపట్టాలని మంత్రి సీతక్క ఆధికారులను ఆదేశించారు. అనంతరం మేడారం(Medaram) జాతరకు వచ్చే నిధులలో రూ. 40 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు.

జీహెచ్​ఎంసీలో రెండో రోజు భారీగా అభయహస్తం దరఖాస్తులు - ఎక్కువగా వాటి కోసమే

Minister seethakka Visits Mulugu for Prajapalana : బ్రిడ్జి రోడ్లను పరిశీలించిన అనంతరం, మంత్రి సీతక్క మండలంలోని పస్రా గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజలకు మంత్రి వివరించారు. కాంగ్రెస్​(Congress) పార్టీ చేపట్టిన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాడ్వాయి మండలంలోని అడవిలో నివసిస్తున్న మొండాల తోగు గొత్తి కోయగూడానికి మంత్రి సీతక్క వెళ్లి గిరిజనుల వద్ద దరఖాస్తులను స్వీకరించారు.

అనంతరం ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ మంత్రి గిరిజనులను అడిగారు. దానికి వారు గ్రామ సమస్యలు ఉన్నాయని బదులిచ్చారు. గ్రామంలో విద్యుత్​, మంచి నీటి సౌకర్యాలు లేవని తెలిపారు. పిల్లలకు చదువుకునేందుకు కావాల్సిన సరైన సదుపాయాలు కూడా లేవని మంత్రికి వివరించారు. సమస్యలను వెంటనే పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సీతక్క అరేగూడెంలో పాఠశాలలో చదువుతున్న చిన్నారుల దగ్గరకు వెళ్లి సరదాగా గడిపారు. చిన్నారులతో ముచ్చటించిన తర్వాత బిస్కెట్​ ప్యాకెట్స్​ పంపిణీ చేశారు.

Minister Seethakka Prajapalana Meeting : ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని అరే గూడెం గ్రామస్థులను కలిశారు. వారి నుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతమైనా ప్రజాపాలన కార్యక్రమం అందుబాటులో ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ప్రజల వద్దకు అధికారులే వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాపాలన : మంత్రి సీతక్క

ప్రజల సమస్యలను పరిష్కారించడానికే ప్రజాపాలన చేపట్టాం : సీతక్క

కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారం - ఇదిగో క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.