ములుగు జిల్లా జీవంతరవుపల్లి గ్రామ సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యంలో తాలు, మట్టిపెళ్లలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ధాన్యంలో తాలు పేరిట రైస్ మిల్లర్లు అన్నదాతలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పనులకు దాదాపు 20వేల మందికి పైగా హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ జగదీష్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.