ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని.. మేడారం చిన్న జాతరకు సన్నాహకాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఉత్సవాల విధివిధానాలపై సమావేశం అయ్యేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజులకు కొబ్బరికాయ కొట్టి మంత్రి పసుపు కుంకుమ సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఐటీడీఏ పీవో హనుమంతు, తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:దేశంలో 'భాషా జాతీయవాదం' చిచ్చు!