మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి మూడు రోజుల ముందే 'మండమెలిగే పండగ'ను పూజారులు జరుపుతారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు మినీ మేడారం జాతర జరగనుంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు... ఆ తర్వాత వనదేవతల్ని దర్శించుకుంటున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మలను రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చిన వచ్చిన మంత్రికి సన్నాయి మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మలకు మంత్రి చీరలు సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ఈసారి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వనదేవతలను దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: ప్రారంభమైన మేడారం చిన జాతర.. తరలొచ్చిన భక్తులు