ETV Bharat / state

సాగుభూమిలో భవనాలు నిర్మిస్తే ఎలా?.. మంత్రిని నిలదీసిన రైతులు - అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం వార్తలు

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో సఖి భవనాన్ని నిర్మించడం సరికాదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ములుగులో పర్యటిస్తున్న మంత్రిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి సత్యవతి రాఠోడ్... భూమిని కోల్పోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

minister-satyavathi-rathod-initiated-development-works-in-mulugu-district
సాగుభూమిలో భవనాలు నిర్మిస్తే ఎలా.. మంత్రిని నిలదీసిన రైతులు
author img

By

Published : Dec 29, 2020, 5:16 PM IST

minister satyavathi rathod initiated development works in mulugu district
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ గ్రామ సమీపంలో డిగ్రీ కళాశాల వద్ద ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ మాలోతు కవితతో కలిసి సఖి కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులతో గొడవకు దిగారు.

'సాగు భూమిలో భవనాలు నిర్మిస్తే... మేము ఏం చేయాలి?'

అన్యాయం చేయకండి..

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకున్న భూమిలో... సఖి భవనం కట్టడం అన్యాయమని వాపోయారు. స్పందించిన మంత్రి భూమి కోల్పోయిన వారికి భూమి లేదా డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు వచ్చేలా చూడాలని కలెక్టర్​కు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని కలెక్టర్​ హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమణిగారు. అనంతరం జంగాలపల్లి అంగడి వద్ద భవనంలో పది లక్షల విలువ చేసే శానిటరీ న్యాప్​కిన్​ యంత్రాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి: అభివృద్ధి పనులకు మంత్రి సబిత శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.