pattu vastralu samarpana: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు, గోవిందరాజులకు చంద వంశస్థులు పట్టువస్త్రాలు సమర్పించారు. జాతరను మాఘశుద్ధ పౌర్ణమి సమయంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మేడారం ఆదివాసి తలపతులు గురువారం రోజు ఉదయం సమ్మక్క పుట్టినిల్లైన బయ్యక్కపేట గ్రామం నుంచి చంద వంశస్థులు వారి ఆచారాల ప్రకారం ఆడపడుచులు ఆ ఊరి పెద్దలు వడివాల బియ్యం, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, బంగారం, పట్టు వస్త్రాలను తీసుకొచ్చి అమ్మలకు సమర్పించారు. ఆదివాసీ సాంప్రదాయాలతో వస్త్రాలు పట్టుకుని డోలి చప్పుళ్లతో శివసత్తులతో పరుగులు తీస్తూ... సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు వస్త్రాలు సమర్పించుకున్నారు. దీవించండి తల్లులురా అని మనసారా వేడుకున్నారు. తమ ఇంటి ఆడపడుచుని గౌరవించడం ఆచారమని జాతర వారం రోజుల ముందు దేవతలకు పట్టువస్త్రాలు సమర్పిస్తామని చంద వంశస్థులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Medaram Invitation Card: మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వాన పత్రిక