ETV Bharat / state

మావోయిస్టు కొరియర్​ కారం జగపతి అరెస్ట్​

author img

By

Published : Jun 27, 2020, 9:12 PM IST

మావోయిస్టు కొరియర్​ కారం జగపతిని ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. జగపతి నుంచి 17 లక్షల 40 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, విప్లవ సాహిత్యం, ఓ చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. జగపతితో పాటు ఉన్న తునికాకు కాంట్రాక్టర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరిని రిమాండుకు తరలించారు.

Maoist Courier  karam jagapathi arrested at thippapuram
మావోయిస్టు కొరియర్​ కారం జగపతి అరెస్ట్​

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం వద్ద మావోయిస్టు కొరియర్ కారం జగపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిప్పాపూర్, ఆలువాక మార్గమధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా... ద్విచక్రవాహనంపై తునికాకు కాంట్రాక్టర్​తో వెళ్తున్న జగపతిని పోలీసులు పట్టుకున్నారు. జగపతి నుంచి 17 లక్షల 40 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, విప్లవ సాహిత్యం, ఓ చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్ర కమిటీ సభ్యుడు హరి భూషణ్ బడే చొక్కారావు, దామోదర్, కంకణాల రాజిరెడ్డి, శారద, అజాద్, కొయ్యడ సాంబయ్యలాంటి అగ్ర నాయకులకు పార్టీ ఫండ్​ అందజేసేవాడని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జగపతితో పాటు తునికాకు కాంట్రాక్టర్​ను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.