ETV Bharat / state

పెళ్లి చేయరేమో అన్న భయంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - ములుగులో ప్రేమికులు ఆత్మహత్య

Lovers Committed Suicide in Mulugu : వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. జీవితాంతం కలిసే బతకాలని కలలు కన్నారు. ఇంతలో యువతి తండ్రి మరో వ్యక్తితో పెళ్లి ప్రస్తావన తేవడంతో.. తమ ప్రేమను అంగీకరించరేమోనన్న భయంతో చావే శరణమని భావించి ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు అడవి ప్రాంతంలోని గుట్టపై జరిగింది.

Lovers suicide in Mulugu
Lovers Committed Suicide in Mulugu
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 1:14 PM IST

Lovers Committed Suicide in Mulugu : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఏడగులు వేద్దామని ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే తండ్రి పెళ్లి ప్రస్తావన తేవడంతో యువతి.. ఇంట్లో తన ప్రేమ వ్యవహారం చెప్పింది. అయినాసరే వేరే వ్యక్తితో పెళ్లి చేసేస్తారేమోన్న భయంతో.. ఆ ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. చావైనా బతుకైనా కలిసే ఉందామని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్య(Committed Suicide)కు యత్నించారు. ఈ ఘటనలో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందగా.. యువతి చావుబతుకుల మధ్య పోరాటం చేస్తోంది. ఈ విషాద ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు అడవి ప్రాంతంలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలంలోని కమలాపూర్​ గ్రామానికి చెందిన మాదరి శిరీష(22), ఎటూరునాగారం పట్టణానికి చెందిన బెజ్జంకి రాజేశ్​ (24) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమను ఇంట్లో చెప్పలేదు. చెబితే ఎక్కడ వారిని విడదీస్తారనే భయంతో సమయం కోసం వేచి చూశారు. అయితే ఆ యువతి తన ఇంట్లో పెద్ద అమ్మాయి.. తనతో పాటు ఇంకా ఇద్దరు చెల్లెళ్లు ఉండడంతో తండ్రి వివాహం చేయాలని నిర్ణయించాడు.

అందుకు ఆమె మూడేళ్లు సమయం కోరింది. అందుకు ఆయన మూడేళ్లు ఇవ్వలేను కానీ ఆరు నెలలు సమయం ఇస్తానని చెప్పారు. ఈ సమయంలోనే తండ్రి ఓ సంబంధం తీసుకురావడంతో.. తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని తండ్రితో చెప్పింది శిరీష. తమ ప్రేమను ఇంట్లో అంగీకరించరని.. తన ప్రియుడితో పెళ్లి చేయరనే ఉద్దేశంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దాడి.. 20 సార్లు కత్తులతో పొడిచి..

Lovers Committed Suicide by Poison : ఇద్దరం ఉంటే కలిసే ఉందాం లేకపోతే జీవితం వృథా అని భావించి.. కలిసే చనిపోదామని నిర్ణయించుకొని మంగళవారం రాత్రి మంగపేట మండలంలోని వల్లూరు అటవీ ప్రాంతంలోని గుట్టపైకి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఇంతలో వారికి ఏం గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ.. బతకాలనే కోరిక కలిగిందేమో. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు వాట్సాప్​ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నామని లోకేషన్​ను పంపించారు. వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని.. వారితో పాటు అంబులెన్స్​ను తీసుకువెళ్లారు.

Telangana Crime News : హుటాహుటిగా వారిద్దరినీ ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఇంతలో వారి పరిస్థితి విషమించడంతో వరంగల్​లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న ఇద్దరిలో యువకుడు బుధవారం(నేడు) తెల్లవారుజామున మృతి చెందాడు. ఆస్పత్రిలో యువతి ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాలలో తీవ్రవిషాదం నెలకొంది.

New wed lady Commits Suicide : కలిసి ఉండలేక.. వీడలేక.. తనువు చాలించిన నవవధువు

ప్రేమ వివాహంపై కక్ష.. పెళ్లి కుమారుడి అన్నయ్యను కిడ్నాప్ చేసిన యువతి బంధువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.