ములుగు జిల్లాలోని ఏటూరునాగారం రేంజి కన్నాయిగూడెం అడవుల్లో నాలుగు రోజులు క్రితం పులి సంచరిస్తుందని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా బీట్ అధికారులు రాత్రి, పగలు గస్తీ కాస్తున్నారు.
కాపర్లు కూడా అటవీ ప్రాంతంలో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై అటవీ శాఖ సిబ్బంది గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పులి ఈ ప్రాంతంలో ఉందా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పులికి సంబంధించి ఎలాంటి వదంతులు నమ్మకూడదని డీఎఫ్వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు.
ఇదీ చూడండి: ముప్పతిప్పలు పెట్టింది... ఎట్టకేలకు చిక్కింది