ETV Bharat / state

Heavy Rains in Telangana : రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు.. మరో మూడురోజులు ఇదే పరిస్థితి..!

Heavy Rains in Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు పడుతున్నాయి. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాగులు, వంకలు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. రెండురోజులుగా ముసురుపట్టడంతో సాగుపనులు జోరందుకుంటున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.

Heavy Rains
Heavy Rains
author img

By

Published : Jul 19, 2023, 7:40 PM IST

Updated : Jul 19, 2023, 8:20 PM IST

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు.. ఉరకలెత్తుతున్న వాగులు, వంకలు.. మరో మూడురోజులు.!

Telangana Rains Today : రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టుకుంది. రెండురోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. నిజామాబాద్‌ శివారులో గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల వర్షపు నీటితో చెరువును తలపించింది. దీంతో బడికి వచ్చిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎడతెరిపి లేని వానలతో వాగులు వంకలు జలకళ సంతరించుకున్నాయి. పలు చోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. సిరికొండ మండలంలో గడ్కోల్, తూంపల్లి, కప్పల వాగులు జలకళను సంతరించుకున్నాయి. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతోంది. నిజామాబాద్ -హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు వర్షంతో అంతరాయం కలిగింది.

Heavy Rains in Joint Karimnagar Disrict : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వానలతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజులుగా ముసురు నెలకొనటంతో రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడురోజులుగా ముసురు పట్టుకుంది. లోతట్టు ప్రాంతాల్లోని నివాస సముదాయాల్లో నీళ్లు నిలిచి స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో రహదారులు జలమయ్యాయి. హనుమకొండ జిల్లా పరకాలలోని చలివాగు అలుగు పోస్తోంది. పైడిపల్లి శివార్లలో కొత్తగూడెంలో ఓ పాత పెంకుటిల్లు కూలి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గార్ల శివారులో పాకాల వాగు ప్రవాహంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కూలీలతో కలిసి నాట్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిన్నగంగారం వద్ద పాలెం వాగు జలాశయం ప్రధాన కాలువకు గండి పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లి ఏజెన్సీలోని తిప్పాపురం, పెంకవాగు, కలిపాక, మల్లాపురం, రాజపల్లి సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఎలిసెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను విపత్తు నిర్వహణ బృందాలు బోటు సహాయంతో వాగు దాటించారు. అనంతరం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ఏటూరునాగారంలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ త్రిపాఠి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ మహానగర వ్యాప్తంగా రెండురోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మెదక్‌ జిల్లా హవేళిఘనాపూర్ మండల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్ పేట్ శివారులో మహిళా కూలీలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాట్లు వేశారు.

వరద నీటితో జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు, చెరువులు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మండలాల్లో వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ సంతరించుకుంటున్నాయి. గుండాల మండలంలో గుండాల-కోడవటంచ లోలెవల్‌ వంతెన పైనుంచి కిన్నెరసాని ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం శంభునిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రహరీ వెంబటి ఉన్న వృక్షం నేలకొరిగింది. వర్షం కారణంగా అటువైపు ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సత్తుపల్లి నియోజకవర్గంలో బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది.

ఎడతెరిపి లేకుండా వాన.. సింగరెేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి : ఎడతెరిపి లేని వానతో.. సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, భూపాలపల్లి, పెద్దపల్లి సహా అన్ని ఏరియాల్లో ఓసీ(ఓపెన్ కాస్ట్​)లో బొగ్గు వెలికితీయకపోవడంతో సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లింది. రామగుండం ఏరియాలోని నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో మూడు షిఫ్టుల విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టుల్లోని పని స్థలాల వద్ద భారీగా వరద నీరు చేరడంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు ప్రాజెక్టు ఆవరణలో అధిక శాతం బురద ఉండడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. నాలుగు ప్రాజెక్టులలో మూడు షిఫ్ట్​లకు సంబంధించి సుమారు 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ఇంకా ప్రవాహం వస్తోంది. ఈరోజు ఉదయం 24 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రి 7 గంటలకు 33.5 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలంలో ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే వరద నీరు పెరగటం వల్ల భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద కూడా గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. వరద నీరు పెరగడంతో పర్ణశాల వద్ద గల సీతవాగు పొంగి సీతమ్మ నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : భద్రాద్రి వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నందువల్ల లోతట్టుప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ముంపునకు గురయ్యే గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులంతా ఆయా గ్రామాలలోనే ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలన్నారు. వరదలకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో జాలర్లను వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.

రాగల మూడురోజులు భారీ వర్షాలు : రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 19, 2023, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.