తెలంగాణల కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరలో.. సమ్మక్క- సారలమ్మను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ దర్శించుకున్నారు. జాతరలో అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై తమిళిసై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌కు పంపించారు.
వనదేవతల దర్శనం సులభతరం చేసేందుకు మీరు, మీ యంత్రాంగం చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయం. మీ పనిని రికార్డుల్లో ఉంచాలనుకుంటున్నాం. నా సందర్శన సమయంలో విస్తరించిన మర్యాదలకు వ్యక్తిగతంగా.. మీ బృందంలోని ప్రతీ సభ్యునికి ధన్యవాదాలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.
జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
ఇవీచూడండి: మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు