వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న ములుగు జిల్లా బల్లన్నగూడెం గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కరోనా నిర్ధరణ పరీక్షలు ఆలస్యం కావడం వల్లే.. సరైన వైద్యం అందక మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఉపాధ్యాయుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈనెల 17న అతడికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 19న వచ్చిన నివేదికల్లో నో రిజల్ట్ అని వచ్చిందని తెలిపారు. ఈలోగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడన్నారు.
ఇదీచూడండి: కాస్త తగ్గింది.. రాష్ట్రంలో మరో 1,198 కరోనా కేసులు