ములుగు జిల్లా మేడివాగు సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన బండారుపల్లికి చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం మత్స్యకారులు గాలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో మేడివాగు, రామప్ప సరస్సుకు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వరద తాకిడికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి, పొర్లుతున్నాయి. వరద నీరు ప్రభావంతో పంటపొలాలు సైతం దెబ్బతింటున్నాయి.
ఇదీ చూడండి : వరద పోటు.. భద్రాద్రిలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక