భాజపా ప్రభుత్వం రైతుల మేలు కోసం వ్యవసాయ చట్టం తీసుకొస్తే.. ఇన్నిరోజులు ఎలాంటి మేలు చేయని కాంగ్రెస్, తెరాస పార్టీలు విమర్శిస్తున్నాయని రాష్ట్ర భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలో భాజపా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన వ్యవసాయ చట్టం ద్వారా రైతులు వారి పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్నదాతలకు రక్షణ, సహాయకారిగా ఉండే చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెరాస చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.
భాజపా ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటుందని ప్రకాశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జింకల కృష్ణారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చు: భాజపా ఎంపీలు