తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ నిలపడమే.. పోలీస్ శాఖ లక్ష్యమని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇవ్వడం కోసం స్టేట్ ఆప్ ఆర్ట్ అప్స్కేల్ కోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత... మళ్లీ తెలంగాణలో నక్సలిజం వస్తోందని అనే అపోహలను పటాపంచలు చేస్తూ.. పోలీసు వ్యవస్థ ప్రగతి పథంలో నడుస్తోందని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని పావులు కదుపుతున్న మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే వారి చర్యలను తిప్పికొడతామని అన్నారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలను ముందుకు తీసుకెళ్తూ, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రజలకు సహకారాన్ని అందిస్తోందన్నారు.
- ఇదీ చదవండి: కొత్తరకం కరోనా వైరస్‌తో బీ అలర్ట్: ప్రభుత్వం