ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతంలో స్నానం చేస్తూ గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హన్మకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గోపీచంద్గా గుర్తించారు.
ఆదివారం.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి గోపీచంద్.. జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో మరోమార్గం నుంచి ప్రవేశించారు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. అక్కడ వరద ప్రవాహంతో నీటి కొలను కింది ప్రాంతానికి కొట్టుకుపోయారు. మత్య్సకారుల గాలించి మృతదేహాన్ని గుర్తించారు.
ఇవీచూడండి : ఫేస్బుక్లో ప్రేమించాడు.. పెళ్లి పేరుతో కిరాతకంగా చంపేశాడు!