ETV Bharat / state

సీపీఐ మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్...

author img

By

Published : Jun 2, 2020, 7:49 PM IST

ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు దళ సభ్యున్ని ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల క్రితం తన అమ్మను చూసేందుకు వచ్చి తిరిగి దళంలోకి వెళ్తున్న క్రమంలో... తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డాడు.

cpi Maoist activist arrested in mulugu district
సీపీఐ మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్...

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు దళ సభ్యుడు అరెస్టయ్యాడు. గ్రామ శివారులో తనిఖీలు చేస్తున్న పోలీసులను పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని విచారించారు. ఈ విచారణలో అతని పేరు మిస్సగి ఉంగయ్యగా వెల్లడించాడు. 2016 నుంచి ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు దళ సభ్యుడిగా చేరి... అనంతరం ఖమ్మం డీఎస్సీ అయిన కొయ్యడా సాంబయ్య అలియాస్​ గోపన్న అలియాస్​ ఆజాద్ ప్రొటెక్షన్ టీంలో గార్డుగా పనిచేసినట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

మూడు రోజుల క్రితం మంగపేట మండలంలోని బొంబాయిగూడెంలో వున్న తన అన్న నివాసానికి వచ్చి... తల్లిని చూసి వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. దళ సభ్యుడైన వుంగయ్యని రిమాండ్​కి పంపిస్తునట్లు ఏటూరు నాగారం ఏఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు.

ఇదీ చదవండి: జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.