ETV Bharat / state

Congress Bus Yatra 2023 Started : కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ - Congress Bus Yatra 2023 started

Congress Bus Yatra 2023 Started : ములుగు జిల్లాలో రామప్ప ఆలయం వేదికగా కాంగ్రెస్ విజయభేరీ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించారు.

Congress Bus Yatra 2023
Congress Bus Yatra 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 5:49 PM IST

Updated : Oct 18, 2023, 10:48 PM IST

Congress Bus Yatra 2023 Started at Mulugu District : తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పర్యటన మొదలైంది. తొలుత వారు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వారికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్, కోదండ రెడ్డి, నిరంజన్, రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, వేణుగోపాల్ రావు, తదితరులు ఘన స్వాగతం పలికారు.

Telangana Congress MLA Tickets Disputes 2023 : పాలమూరు హస్తంలో అసమ్మతి.. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకుని భంగపడ్డామని నేతల అసంతృప్తి

Congress Vijayabheri Yatra 2023 : హైదరాబాద్‌ నుంచి వారు హెలికాప్టర్‌లో ములుగు జిల్లాకు చేరుకున్నారు. రామప్ప దేవాలయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు నిర్వహించారు. ఆలయం నుంచే కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రను (Bus Yatra ) రాహుల్, ప్రియాంక ప్రారంభించారు. అనంతరం బస్సులో.. పార్టీ నేతలతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసిన రామానుజపురం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచే వారు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Congress Bus Yatra 2023 Started కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ

ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌ అని.. ఎందరో విద్యార్థులు, యువత త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని చెప్పారు. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy Comments on KCR : రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరటం లేదని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని కరీంనగర్‌ గడ్డపై సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చారని గుర్తు చేశారు. ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని సోనియా భావించారని.. అందుకు ఆరు గ్యారెంటీలు అమలు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Congress MLA Candidates Second List in Telangana : ఈ నెల 21 తర్వాతే కాంగ్రెస్​ అభ్యర్థుల రెండో జాబితా.. 9 స్థానాల ఎంపికకు కసరత్తు

Telangana Assembly Elections 2023 : కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ జోడోయాత్ర చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రజల సంపదను ప్రజలకు పంచేందుకే ఆరు గ్యారెంటీల అమలు అని చెప్పారు. ప్రత్యేక అటవీచట్టం తీసుకువచ్చి పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఓరుగల్లు అంటేనే.. పోరాటాల గడ్డని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ అని సీతక్క తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. పేదలను మరింత పేదలుగా మార్చిన ఘనత భారత్ రాష్ట్ర సమితి అని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండకుండా చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గం అంటనే తన ఇల్లని... ఇక్కడి ప్రజలే తన కుటుంబసభ్యులని చెప్పారు. చివరి శ్వాస వరకు ప్రజాసమస్యల కోసం పోరాడుతానని సీతక్క వ్యాఖ్యానించారు.

Revanth Reddy Speech at Congress Public Meeting in Vikarabad : 'తెలంగాణ దశ.. దిశ మార్చే సమయం వచ్చింది'

Last Updated : Oct 18, 2023, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.