CM KCR Public Meeting at Mulugu : ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఇంకేమీ లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు వచ్చాయా.. పోడు పట్టాలు ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులకు ఎన్నో సార్లు మొక్కానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో పార్టీల దృక్పథం చూసి ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.. రాష్ట్ర హక్కుల కోసమని అన్నారు. పదిహేనేళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లుగా బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉందని.. కానీ కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని పేర్కొన్నారు. అయితే ఎవరి పాలనలో ఎంత మేలు జరిగిందో పోల్చి చూడాలని ములుగు సభకు విచ్చేసిన ఓటర్లను కోరారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవు - మన దేశంలోనూ అలాంటి విధానం రావాలి : సీఎం కేసీఆర్
BRS Praja Ashirvada Sabha at Mulugu in Telangana : కంటి వెలుగు(Kanti Velugu) వంటి కార్యక్రమాన్ని ఎవరూ ఊపించలేదని.. ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 80 లక్షల మందకి కళ్లద్దాలు పంపిణీ చేశామని వివరించారు. ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి కిందర రూ.లక్ష 116 ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీరు ఇస్తున్నామని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని రేవంత్రెడ్డి అంటున్నారని.. అలాగే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని మండిపడ్డారు.
"పోడు భూముల సమస్య కూడా ఇంచుమించు క్లియర్ చేసుకున్నాం. నాకు తెలుసు కొంతమంది గిరిజనులు కాని వారికి కూడా పోడు భూముల ఉన్నాయి. వారి సమస్యకు పరిష్కారం కావాలని అడుగుతున్నారు. అది కేంద్రం చేతిలో ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా. తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వాళ్లకు కూడా పట్టాలు ఇప్పిస్తాం. ఎందుకంటే ములుగు నాది. తెలంగాణలో ఏ ఊరు, పల్లె ఎక్కడ బాగుపడిన కేసీఆర్కు పేరే కదా." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
CM KCR About on Dharani Portal : ధరణి ఉండటం వల్ల రైతుబంధు డబ్బులు ఇవ్వగలుగుతున్నామని.. అదే ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం, లంచాల రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అయినా ఈ ధరణిని తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ పోర్టల్ తీసేయడం వల్ల మళ్లీ వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వోలు వస్తారన్నారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు(Rythu Bandhu)లో సగం ఇవ్వమని అడుగుతారని చెప్పారు. నాటి కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు వచ్చాయా.. పోడు భూములకు పట్టాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వాటి అన్నింటికీ పరిష్కారం చూపి.. సక్రమైన పాలనను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేకపోయింది : సీఎం కేసీఆర్
జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది : కేసీఆర్