ETV Bharat / state

Medaram Jatara 2022: మేడారం జాతరపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - కేసీఆర్ సమీక్ష

CM Review on Medaram Jatara: త్వరలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క జాతరపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు చేస్తున్న కసరత్తులు, భక్తులకు సౌకర్యాలు వంటి పలు అంశాలపై సూచనలు ఇవ్వనున్నారు. ఈసారి జాతరకు రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా అన్ని రకాల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది.

Medaram Jatara 2022
ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
author img

By

Published : Jan 21, 2022, 8:21 AM IST

CM Review on Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద జాతరైనా మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల జాతరపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఆయన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అక్కడి పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై వైద్యఆరోగ్యశాఖను ప్రభుత్వం నివేదిక కోరింది.

మేడారం జాతరలో కరోనా నిబంధనల అమలుపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మేడారానికి ఇప్పటికే భక్తజన ప్రవాహం మొదలైందని, రోజుకు నాలుగు లక్షల మంది వస్తున్నారని తెలిపారు. కరోనాపై భక్తులను అప్రమత్తం చేస్తున్నామన్నారు.

జాతర ఎప్పుడంటే..

ఫిబ్రవరి 16నుంచి 19 వరకు మేడారం జాతర జరగనుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెమీదకు తీసుకొస్తారు. రెండో రోజు చిలకలగుట్ట మీద నుంచి భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె మీదకు తీసుకురానున్నారు. మూడో రోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద భక్తులకి అభయప్రదానం చేస్తారు. నాలుగోరోజు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర పూర్తవుతుంది.

ఇదీ చూడండి: medaram jathara: మేడారంలో భక్తుల రద్దీ.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.