ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలోని బొగత జలపాతం గత మూడు రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జాలువారుతున్న జలపాతం వీక్షకులను కట్టిపడేస్తోంది. తెలంగాణ నయాగరా పేరొందిన బొగత జలపాతానికి రాష్ట్రం నలుమూలల నుంచి పర్యటకులు వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. సందర్శనకు వచ్చేవారికి రవాణాతో పాటు పర్యటక శాఖ తరఫున కొన్ని వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఇదీ చదవండిః జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం