ములుగు జిల్లా కేంద్రంలోని మహర్షి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే సీతక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం 100 వ రోజుకు చేరుకున్న సందంర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
ఆసుపత్రుల్లో రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని... అలాంటి వారిని ఆదకునేందుకు తమవంతు సాయంగా శిబిరం ఏర్పాటు చేసినట్లు సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణాదిత్య... ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. గుట్టలు, వాగులు సైతం లెక్కచేయకుండా గిరిజనుల ఆకలితీర్చేందుకు ఎమ్మెల్యే చేసిన సేవ అభినందరనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు ప్రశంసా పత్రాలు అందించారు.