లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న ప్రజలపై.. తెలంగాణ ప్రభుత్వం పెనుభారం మోపిందని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ములుగు జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
స్లాబ్‌ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మండిపడ్డారు. రాష్ట్రంలో అధిక విద్యుత్ ఛార్జీలు విధించడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి.. స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో కరోనా తీవ్రం.. 6 రోజుల్లోనే 10వేల కేసులు