పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించి ప్లాస్టిక్‌పై పోరాటం చేయాలని ములుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ పేర్కొన్నారు.
పాదయాత్ర..
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం చిన్న జాతరని ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలంటూ.. కొలిపాక ప్రభాకర్ అనే యువకుడు పాదయాత్ర చేపట్టాడు. అందులో భాగంగా కాజీపేట నుంచి మేడారానికి చేరుకున్నాడు.
మానవ మనుగడే..
ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న యువకుడుకి సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ సంఘీభావం తెలిపారు. కొబ్బరి నీళ్లు అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్‌రిజిస్టర్ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకంతో అనారోగ్యాల బారినపడుతున్నారని.. ఇలానే కొనసాగితే మానవ మనుగడే కనుమరుగవుతుందని తెలిపారు.