ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో యన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు పర్యటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మహా జాతరకు విద్యుత్ అసౌకర్యం జరగకుండా చూడాలన్నారు.
జాతరలో విద్యుత్ నిరంతరం ఉండే విధంగా చూసేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఎండి గోపాల్ రావు అన్నారు. జాతరకు 300 మంది ఉద్యోగులను నియమించామని ప్రతి సబ్ స్టేషన్కు ఇద్దరు చొప్పున ఉంటారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : విద్యార్థుల అదృశ్యం: ప్రయోజకులమై తిరిగొస్తాం...