ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలుడు చేయి(boy lost hand) కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామానికి చెందిన మండపల్లి దుర్గయ్య, సమ్మక్క దంపతుల కుమారుడు నతానియేలు.. ఆగస్టు 17న స్నేహితులతో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కింద పడ్డాడి. బాలుడి చేతికి గాయమైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. బాలుడిని ఏటూరునాగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు ప్రాథమిక చికిత్స చేసి(boy lost hand) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టువేసి పంపించారు.
చేయి కుళ్లిపోయింది
అనంతరం నాలుగు రోజులకు చేయి వాపు పెరిగి, నొప్పి తీవ్రం కావడంతో మళ్లీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరిశీలించి చేయి కుళ్లిపోయిందని(boy lost hand).. ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు పరిశీలించి మరో ఎముకల ఆస్పత్రిని సూచించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి చేతిని తొలగించారు.
చర్యలు తీసుకుంటాం
ఏటూరునాగారంలో చికిత్స చేసిన వైద్యుడిని బాధితులు నిలదీయగా ఆపరేషన్‌కు రూ. 10వేలు ఇస్తానని చెప్పారు. ప్రైవేటు వైద్యుని మీడియా వివరణ కోరగా తాను ఎముకల చికిత్స చేయలేదని.. ఎక్స్ రే మాత్రమే తీసి ఎముకకు గాయం కావడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. బాలుడి తల్లిదండ్రులే(boy lost hand) సగం కట్టు వరకు తొలగించి నాటు మందు కట్టు చేయించుకున్నారని చెప్పారు. దాని వల్లే ఇబ్బంది తలెత్తి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్యను మీడియా వివరణ కోరగా ఆస్పత్రిని పరిశీలిస్తామని వాస్తవాలు ఏమిటో విచారణలో తెలుసుకుంటామని చెప్పారు. వైద్యుడిదే తప్పని తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇదీ చదవండి: GRMB MEETING: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ.. ఆ అంశంపైనే కీలకచర్చ!