ETV Bharat / state

మూగజీవిపై పైశాచికత్వం... - మేడ్చల్ జిల్లా

మూగ జీవి మెడ కోసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా గబ్బిలాలపేట్‌లో చోటుచేసుకుంది.

మూగజీవిపై పైశాచికత్వం...
author img

By

Published : Sep 1, 2019, 6:58 PM IST

మేడ్చల్ జిల్లా గబ్బిలాలపేట్‌లోని గిరిప్రసాద్‌ నగర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కుక్క మెడ కోసి హతమార్చడానికి యత్నించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శునకాన్ని గమనించిన స్థానికులు పశు వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల శునకాన్ని పశు వైద్యశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది రాజు అనే వ్యక్తి అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి : అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి: చుక్క రామయ్య

Intro:మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ లో దారుణం

ఓ మూగ జీవి మెడ కోసి పైశాచికత్వాన్ని ప్రదర్శించిన గుర్తుతెలియని దుండగులు

గబ్బిలాలపేట్, గిరి ప్రసాద్ నగర్ లో కిరాతకంగా ఓ కుక్క మెడ కోసి హతమార్చడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని షాడిస్ట్...

గాయాల పాలై రక్తం మడుగులో వున్న శునకాన్ని (కుక్క) గమనించి పశు వైద్యుడి పిలిపించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు...
ఆ మూగ జీవి పరిస్థితి విషమంగా వుందని ఘటన స్థలి నుండి పశు వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్న వైద్యులు...

ఆ శునకాన్ని హతమార్చాలని ప్రయత్నించింది స్థానికంగా వుండే రాజు అనే వ్యక్తేనని పలుకారణాలతో అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు ఆరోపించడంతో రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు...
అయితే ఈ రాజు అనే వ్యక్తి ఓ సైకోలాగ ప్రవర్తిస్తూ స్థానికంగా వచ్చిపోయే వారిని భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తిస్తుంటాడని గత కొన్ని రోజుల క్రితం ఒంటరిగా వెలుతున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పడం జరిగిందని తెలుస్తుంది..
అయితే మహిళల విషయంలో జరిగిన ఘటనలో జరిగిన విచారణలో రాజు మానసిక రోగి అని తేలినట్టు సమాచారం కాని ఈరోజు జరిగిన మూగజీవి పై జరిగిన కిరాతక దాడిని చూస్తుంటే ఒకవేళ ఈ దారుణం చేసింది ఈ రాజు అనే వ్యక్తి అని తేలితే మళ్ళీ ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ప్రకారం జనాల మధ్య వుంచడం మంచిది కాదని అధికారులు స్పందించి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.