మేడ్చల్ జిల్లా పుర పోరులో అధికార పార్టీకి రెబెల్స్ బాధ తప్పేట్టులేదు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33 వార్డులు ఉండగా ఇప్పటికే తెరాసకు సంబంధించిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిత్వం దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ సత్తా చాటేందుకు మరో మార్గం చూసుకుంటామని గులాబీ పార్టీ రెబల్ అభ్యర్థి ముద్దసాని మహేందర్ తెలిపారు. మరోవైపు పార్టీ బీ- ఫాం దక్కించుకున్న అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: మేడారం జాతరకు ఎలా వెళ్లాలి.. ఛార్జీ ఎంత?