కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గరిగుట్ట, సూరారం, గాజుల రామారం డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లకు కార్యకర్తలు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది సీట్లలో ఏడుస్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని గుర్తించినా ప్రజలు మరోసారి తెరాసకు పట్టం కట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంతోనే గెలిచామన్నారు. ఈ మూడు డివిజన్ల పరిధిలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని వెల్లడించారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్లుకు ఎమ్మెల్యే వివేకానంద్ సూచించారు. ప్రతి డివిజన్ అభివద్ధికి తమ సహకారం ఉంటుందని ఆయన అన్నారు.