ETV Bharat / state

యశోదలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్​లకు చికిత్స - medchal district news

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​ ఘటనలో కాలిన గాయాలతో బాధపడుతున్న సీఐ భిక్షపతి రావుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Treatment for CI Bikshapathi and Constable Arun in Yashoda
యశోదలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్​లకు చికిత్స
author img

By

Published : Dec 25, 2020, 3:09 PM IST

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​ ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్ అరుణ్​లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలైన సీఐని ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.

గురువారం రోజున జవహర్​నగర్​ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపులో కబ్జాదారులు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై దాడి చేశారు. సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్​ అరుణ్​పై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.