పాలన విషయంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy on CM KCR) తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్‌మీట్లు చూస్తే చిక్కడపల్లి కల్లు కాంపౌండ్‌ను తలపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సంజయ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భాజపా ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. భాజపా, తెరాస డ్రామా ఆడుతున్నాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.
కిషన్‌రెడ్డికి సవాల్
సీబీఐ విచారణ వేయండి.. కేసీఆర్ అవినీతి నిరూపిస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎం అవినీతిని నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మరోసారి యోగిని సీఎంగా చేసేందుకు కేసీఆర్‌తో మోదీ ఒప్పందం చేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఇస్తామని... 5 నెలలుగా అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నామని అన్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పిచ్చే ధైర్యం బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. నెక్లెస్‌రోడ్‌లో సంజీవయ్య పార్కును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్రమించాడని విచారణకు ఆదేశించే దమ్ము భాజపాకు ఉందా అని నిలదీశారు. ట్యాంక్‌బండ్‌పై నిర్మిస్తున్న అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘‘నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఆయన అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలి. విద్యుత్ ప్రాజెక్టుల్లోనే కేసీఆర్ రూ.వెయ్యికోట్ల అవినీతి చేశారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా.. సీబీఐ విచారణ వేయించండి. కేసీఆర్ అవినీతిని నేను నిరూపిస్తా. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా-’’ రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
సోనియా ఆమోదిస్తే ప్లీనరీ
సోనియా గాంధీ ఆమోదిస్తే హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భవిష్యత్‌లో మరిన్ని శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
టఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయండి'
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉద్యోగాల నోటిఫికేషన్లపై మాట్లాడుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వెంటనే నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కొంపల్లిలో నిర్వహిస్తున్న కార్యకర్తల శిక్షణా తరగతుల్లో అయన మాట్లాడారు.
టీఎస్ ఐపాస్ పేరుతో కేటీఆర్ మరో మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. మిషన్ భగీరథ, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్వశిక్షా అభియాన్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేటు సెక్టార్‌లో చిరుద్యోగులు కూడా రోడ్డునపడ్డారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రధాని మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని నిరుద్యోగులను నిండా ముంచారని మండపడ్డారు.
ఇదీ చూడండి: