ETV Bharat / state

ఘోర ప్రమాదం.. మహిళ సహా ముగ్గురు మృతి - A lorry that collided with a bike

accident in Medchal: మేడ్చల్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్​ వెళ్తున్న నవ దంపతులు మేడ్చల్​ బస్​ డిపో దగ్గర ఓ వ్యక్తిని ఢీకొని రోడ్డుపై పడిపోగా.. ఇనుము లోడుతో వెళ్తున్న లారీ వీరి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో వీరితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

road accident in Medchal
road accident in Medchal
author img

By

Published : Sep 12, 2022, 10:47 AM IST

Updated : Sep 12, 2022, 2:19 PM IST

ఘోర ప్రమాదం.. మహిళ సహా ముగ్గురు మృతి

road accident in Medchal: మేడ్చల్​ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై రామాయంపేట పట్టాణానికి చెందిన నవ దంపతులు సాయిరాజ్​, సారిక సొంత ఊరు నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా మేడ్చల్ బస్​ డిపో ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొని పడిపోగా వెంటనే వెనుక నుంచి వస్తున్న ఇనుము లోడుతో వస్తున్న లారీ వీరిపై నుంచి వెళ్లడంతో అక్కడికిక్కడే వారు మృతి చెందారు. వీరు ఢీకొట్టిన వ్యక్తి బలమైన గాయాలతో అక్కడే మృతి చెందారు.

మృతులు సాయిరాజ్​, సారికకు ఈ ఎడాది మర్చిలో పెళ్లి అయ్యింది. వీరు వృత్తి రిత్యా హైదరాబాద్​లో ఉంటుండగా ఆదివారం సెలవు దినం కావటం, సొంత ఊరిలో వినాయక నిమజ్జానికి వేళ్లి ఈరోజు వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మరణంతో సొంత గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Sep 12, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.