మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ రసాయన పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంతో పరిశ్రమలో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం సంభవించినప్పటికీ పరిశ్రమలో కెమికల్ డబ్బాలు కాలిపోయి ఘాటైన వాసనతో కూడిన పొగ వచ్చింది. పొగను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు