ETV Bharat / state

Minister KTR : 'ఈటీవీ భారత్' కథనానికి కేటీఆర్ స్పందన.. రంగంలోకి మేయర్, కమిషనర్

author img

By

Published : Oct 23, 2021, 10:03 AM IST

మేడ్చల్ జిల్లాలో 18 గ్రామాల ప్రజలను గాలి పీల్చుకోకుండా చేస్తున్న జవహర్​నగర్ డంపింగ్ యార్డుపై ఈటీవీ భారత్ ప్రచురించిన కథనానికి రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్(Telangana Municipal Minister KTR) స్పందించారు. డంపింగ్ యార్డును పరిశీలించాలని మేయర్, ఇతర జీహెచ్​ఎంసీ అధికారులను ఆదేశించారు. కేటీఆర్(Telangana Municipal Minister KTR) ఆదేశాలతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్, ఇతర అధికారులు పరిశీలించారు.

Minister KTR
Minister KTR

మేడ్చల్ జిల్లాలోని జవహర్​నగర్​ డంపింగ్​ యార్డు గాఢ దుర్గంధంపై ఈటీవీ భారత్ ప్రచురించిన కథనానికి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్(Telangana Municipal Minister KTR) స్పందించారు. ఆ 18 గ్రామాలకు ఊపిరాడడం లేదు! కథనానికి స్పందించి డంపింగ్ యార్డును పరిశీలించాల్సిందింగా మేయర్, ఇతర అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంఏయూడీ కమిషనర్ అరవింద్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ జవహర్​నగర్ డంపింగ్ యార్డును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలు ఉన్నాయన్న స్థానికుల ఆరోపణలతో అధికారులు డంపింగ్ యార్డును సందర్శించారు.

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు గాలిలోకి విషం చిమ్ముతోంది. గాఢ దుర్గంధంతో జనం శ్వాస పీల్చుకోలేకపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో.. డంపింగ్‌ యార్డు చుట్టూ ఉన్న 18 గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. రెండున్నర లక్షల మంది స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయని అధికార పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవల తమ ప్రాంత ప్రజల సమస్యను దమ్మాయిగూడ పురపాలక సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రణీత ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌(Telangana Municipal Minister KTR) దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.

ఓవైపు ఛైర్​పర్సన్ ట్వీట్.. మరోవైపు ఈటీవీ భారత్​ కథనాలకు స్పందించిన మంత్రి కేటీఆర్(Telangana Municipal Minister KTR) జీహెచ్​ఎంసీ అధికారులు డంపింగ్ యార్డును సందర్శించాలని ఆదేశించారు. అక్కడి సమస్యను పరిశీలించి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.