ETV Bharat / state

KTR About Double Bedroom Scheme : 'అసెంబ్లీ సమావేశాలు ముగిశాక 'డబుల్' ఇళ్ల పంపిణీ'

author img

By

Published : Mar 11, 2022, 12:22 PM IST

KTR About Double Bedroom Scheme : అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మల్లాపూర్‌లో వైకుంఠధామం ప్రారంభించారు. ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా హైదరాబాద్‌ పరిధిలో నాలాలు అభివృద్ధి చేశామని అన్నారు.

KTR About Double Bedroom Scheme
KTR About Double Bedroom Scheme
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక 'డబుల్' ఇళ్ల పంపిణీ

KTR About Double Bedroom Scheme : ఒకప్పుడు వర్షాలు పడితే మూసీకి వరదలు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. కానీ కేసీఆర్ సర్కార్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాలు అభివృద్ధి చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.900 కోట్లకుపైగా నిధులు వెచ్చించి వ్యూహాత్మక నాలాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. రూ.3,866 కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని.. నాచారంలో రూ.75 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్ కూడలికి రెండు వైపులా పైవంతెనలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

మల్లాపూర్‌లో వైకుంఠధామం..

KTR at Inaugurates Cemetery in Uppal: ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మల్లాపూర్‌లో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ వైకుంఠధామాన్నీ జీహెచ్​ఎంసీ నిర్మించింది. కేటీఆర్ వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నారు. అనంతరం ఉప్పల్ కూడలిలో రూ.450 కోట్లతో పైవంతెనకు మంత్రి శంకుస్థాపన చేశారు. వచ్చే నెల రూ.35 కోట్లతో నిర్మించిన స్కైవాక్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.6 కోట్లతో శిల్పారామాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.

వచ్చే నెలలో కొత్త పింఛన్లు..

KTR at Uppal Constituency : "వచ్చే నెల లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేస్తాం. మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాలలు అభివృద్ధిపై దృష్టి సారించాం. రూ.7,300 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఏడాది నుంచే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌కు నలువైపులా 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వెయ్యి పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఉప్పల్‌లో 22 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేసుకుంటున్నాం."

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

అసెంబ్లీ సమావేశాలు ముగిశాక 'డబుల్' ఇళ్లు..

KTR About Development Works : అసెంబ్లీ సమావేశాలు ముగిశాక 2 పడకల ఇళ్లు అందజేస్తామని లబ్ధిదారులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. పేదలకు స్థలం ఉంటే రూ.3 లక్షలు ఈనెలలోనే అందజేస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోసం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నామని వెల్లడించారు. వచ్చే నెల చర్లపల్లి ఆర్‌యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.