ETV Bharat / state

మేడ్చల్‌ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు

కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020 అవార్డు మేడ్చల్‌ మున్సిపాలిటీకి దక్కింది. కేంద్ర బృందం గత సంవత్సరం జనవరి మాసం నుంచి ఏడాది కాలంలో వివిధ అంశాల వారీగా నిర్వహించిన సర్వేలో మేడ్చల్‌ ఎక్కువ స్కోరు సాధించి దక్షిణ జోన్‌లో పరిశుభ్ర పట్టణంగా మొదటి స్థానంలో నిలిచింది. నాలుగు విభాగాల్లో అంశానికి 1500 పాయింట్ల చొప్పున 6000వేల పాయింట్లకు గానూ 3342.28 స్కోరుతో నంబర్‌వన్‌ స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ ప్రకటించారు.

Swachha survekshan Award for Medical Municipality
మేడ్చల్‌ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు
author img

By

Published : Aug 21, 2020, 8:25 AM IST

1) మున్సిపాలిటీలో సేవలు

మేడ్చల్‌ పురపాలకసంఘంలో అందుతున్న సేవలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం 1500 పాయింట్లకు 798.48 పాయింట్లు ఇచ్చింది. పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, తడిపొడి చెత్త సేకరణ, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ తదితర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిదారులకు అందజేయడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని స్కోరు కేటాయించారు.

2) సర్టిఫికేషన్‌ స్కోరు

గత సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రశంసలు, గెలుపొందిన అవార్డులు దృష్టిలో ఉంచుకుని స్కోరు కేటాయిస్తారు. దీనిలో 200పాయింట్లు దక్కాయి.

3) నేరుగా పరిశీలన ద్వారా..

స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం నేరుగా పట్టణంలో పర్యటించి వీధులు, రహదారులు, పచ్చదనం, కార్యాలయం తదితర అంశాలను పరిశీలించి ఈ స్కోరును నమోదు చేశారు. అన్నిట్లో కంటే అధికంగా 1316.17 పాయింట్లు అంశంలోనే దక్కాయి.

4) ప్రజాభిప్రాయ సేకరణ

మున్సిపాలిటీ పనితీరు, అందుతున్న సేవలకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృంద సభ్యులు పట్టణంలోని వివిధ రంగాలను చెందిన వ్యక్తుల వద్ద వారి అభిప్రాయాన్ని సేకరించి వారి స్పందన ఆధారంగా 1500కు స్కోరుకు 1027.63 దక్కించుకుంది.

పడిపోయిన ర్యాంకులు

వరుసగా మూడు సార్లు జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని సొంతం చేసుకున్న బోడుప్పల్‌, పీర్జాదిగూడ నగరపాలక సంస్థలు తాజా పరిశీలనలో దిగువకు పడిపోయాయి. 2016లో మున్సిపాలిటీలుగా ఏర్పాటైన బోడుప్పల్‌, పీర్జాదిగూడలు 2017,18,19లో వరసగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రకటించిన ర్యాంకుల్లో బోడుప్పల్‌ 42వ స్థానానికి, పీర్జాదిగూడ 72వ స్థానానికి పడిపోయాయి. నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపభూయిష్టంగా మారడం, ఆ విభాగాలకు రెండు నగరాల్లోనూ అధికారులే లేకపోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆటోల ద్వారా చెత్త సేకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండటం ర్యాంకు రాకపోవడానికి ఓ కారణంగా ప్రజలు పేర్కొన్నారు.

అవార్డు దక్కడం హర్షనీయం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు దక్కడం హర్షనీయం. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించిన జాబితాలో మేడ్చల్‌ పట్టణం ప్రథమ స్థానం సాధించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పక్కాగా అమలు చేయడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించడం, సకాలంలో పన్నుల వసూలుతోనే ఇది సాధ్యమైంది.- కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

మరింత ఉత్సాహంగా పని చేస్తాం

మేడ్చల్‌ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటిస్థానం దక్కడం సంతోషకరం. మరింత ఉత్సాహంగా పని చేసేందుకు అవార్డు దోహదం చేస్తుంది.- మర్రి దీపికా రెడ్డి, మేడ్చల్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌

ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.