Sreenidhi University Students Protest : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్రైవేటు వర్సిటీలు చట్టరూపు దాల్చకపోవడం వల్ల ఆయా విద్యాసంస్థల మాటలు నమ్మి ముందుగానే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. కళాశాలల తీరును నిరసిస్తూ.. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగుతున్నారు.
Sreenidhi University Controversy : తాజాగా హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో గల శ్రీనిధి విద్యాసంస్థల వద్ద నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వర్సిటీ పేరుతో లక్షలు వసూలు చేసిన యాజమాన్యం.. తమను మోసం చేసిందంటూ కళాశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గత నెల 31న తల్లిదండ్రులు, విద్యార్థులు కళాశాల వద్దకు వచ్చి నిరసన చేపట్టగా.. యాజమాన్యం నచ్చజెప్పింది.
విద్యార్థులను శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలోకి తీసుకుంటామని వర్సిటీ కార్యదర్శి మాతో వర్చువల్ సమావేశం నిర్వహించి చెప్పారు. అందుకు ఆగస్టు 15 వరకు గడువు కోరారు. గడువు పూర్తయినా మళ్లీ వారం సమయం కావాలంటున్నారు. గత ఏడెనిమిది నెలలుగా ఇదే తరహాలో సమస్యను దాటవేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. శ్రీనిధి పేరు చూసి మేము మోసపోయాం. - విద్యార్థుల తల్లిదండ్రులు
'డైరెక్టర్‌తో సమస్యలు పరిష్కారం కావు.. కేసీఆర్ రావాల్సిందే'
Sreenidhi College Students Protest Medchal : అడ్మిషన్లు పొందిన విద్యార్ధులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలోకి(Sreenidhi Engineering College) తీసుకుంటామని వర్సిటీ కార్యదర్శి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన.. ఆగస్టు 15 వరకు గడువు కోరారు. గడువు పూర్తయినా విద్యార్థులను కళాశాలలోకి బదిలీ చేయకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు.. శ్రీనిధి వర్సిటీ వద్దకు చేరుకున్నారు.
Sreenidhi University Face A Major Controversy : భద్రత సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు దూకి లోనికి దూసుకెళ్లారు. వర్సిటీ కార్యదర్శి తక్షణం 290 మంది విద్యార్ధులను కళాశాలలోకి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్కడి ఫర్నిచర్‌తో పాటు అద్దాలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించారు. అనుమతి లేకుండా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, మోసాలకు పాల్పడ్డారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంవత్సరానికి ఒక్కో విద్యార్థికి రూ. 3.5 లక్షలు ఫీజులు డిమాండ్ చేస్తే.. ఇప్పటివరకు రూ.2.5 లక్షలు చెల్లించాం. ప్రభుత్వ అనుమతులు పొందకుండా యూనివర్శిటీ ఓపెన్ చేసి తప్పుచేశారు. గత నాలుగు నెలలుగా మా పిల్లలు చదువు లేక ఇలానే అయోమయ పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా విద్య వ్యాపారంగా మారిపోయింది. - విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యార్థుల భవిష్యత్తుతో వర్సిటీ నిర్వాహకులు ఆడుకుంటున్నారని సమస్య పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వర్సిటీ పేరుతో లక్షలు వసూలు చేయటమే కాకుండా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతున్న తరుణంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
ఏడేళ్ల గోస.. ఏదీ ధ్యాస.. న్యాక్ ‘సి’ గ్రేడ్‌తో మరింత అప్రతిష్ఠ