ETV Bharat / state

శ్రీగంధం..  రైతుల పాలిట వరం... లాభాలనేకం! - తెలంగాణ తాజా వార్తలు

శ్రీగంధం మొక్కలతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. శ్రీగంధం సాగుతో వ్యవసాయంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక లాభాలు వచ్చాయని పలువురు రైతులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం బీమా కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు పెంచితే మరింత లాభ పడొచ్చని సాగు చేసిన రైతులు అభిప్రాయపడుతున్నారు. సిరులు కురిపించే శ్రీగంధం మొక్కల సాగుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

special-training-on-sandalwood-cultivation-at-doolapally-in-medchal-district
రైతుల పాలిట వరం... శ్రీగంధం సాగు
author img

By

Published : Jan 2, 2021, 2:02 PM IST

అత్యధిక లాభాలు పొందడానికి ఏకైక మార్గం శ్రీగంధం మొక్కలు పెంచడమే అని జీవవైవిధ్య శాస్త్రవేత్త జీఆర్‌ఎస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శ్రీగంధం మొక్కలు పెంచే రైతులు, ఆసక్తి ఉన్నవారికి మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని భారత జీవవైవిధ్య సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 50 మంది రైతులకు శ్రీగంధం పెంపకం, సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.

ఎలా సాగు చేయాలి?

శ్రీగంధం మొక్కలు ఎలా పెంచాలి, వాటికి వచ్చే రోగాలు ఏంటి, రైతులు కొత్త పద్ధతులను ఉపయోగించి ఈ మొక్కల ద్వారా ఏ విధంగా లాభాలు పొందుతారో వివరించినట్లు జీఆర్‌ఎస్ రెడ్డి తెలిపారు. ఈ మొక్కలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత లాభం పొందవచ్చని తెలిపారు.

అనుభవాల మార్పిడి

శిక్షణ కార్యక్రమానికి హాజరైన రైతులు తమ అనుభవాలను పంచుకున్నట్లు పేర్కొన్నారు. తమకున్న అనుమానాలను నివృత్తి చేశారని... తాము ఇంకా ఎక్కువగా మొక్కలు పెంచుతామని తెలిపారు.

"నల్లగొండ జిల్లా పసునూర్ గ్రామానికి చెందిన నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ గంధం మొక్కలను అమ్మిన తొలి రైతుని నేనే. 2002 సంవత్సరంలో 20 మొక్కలు కొని, పెంచి వాటిని హైదరాబాద్‌లో ఓ సంస్థకు అమ్మడం వల్ల ఇరవై చెట్లతో రూ.36లక్షల లాభం పొందాను. 50 ఏళ్లుగా వ్యవసాయంలో లాభపడని నేను... కేవలం ఈ మొక్కలు అమ్మడం ద్వారా అధిక మొత్తంలో లాభం పొందాను. బత్తాయి తోట గట్లపై ఈ చెట్లు పెంచాను. ప్రభుత్వం సరైన మార్కెటింగ్ కల్పిస్తే మరింత లాభం ఉంటుంది. భూమి లేనివారు తమ ఇళ్ల ముందు ఈ చెట్లను పెంచుకుని లాభాలు పొందవచ్చు."

-ఇస్తారపు రెడ్డి, శ్రీగంధం చెట్లను అమ్మిన తొలి రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.