సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో బొమ్మల కొలువు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా మల్కాజ్గిరిలో నివసించే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పద్మ శ్రీ.. తన ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సనాతన సంప్రదాయం ప్రకారం దేవుళ్లు, పెళ్లి పందిరి తదితర అంశాలపై బొమ్మలు ప్రదర్శించారు.
ఆధునిక ప్రపంచంలో మనం టెక్నాలజీతో ప్రయాణం చేస్తున్నా.. సంస్కృతీ సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని పద్మ శ్రీ అన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నా కూడా సనాతన పద్ధతులు మరవకుండా తమ పిల్లలతో కలిసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: 'కరీంనగర్ డెయిరీ.. పెట్రోల్లోనూ తన మార్క్ చూపించాలి'