విదేశాల నుంచి వచ్చిన వారికి స్టాంపులు వేశారని... వారందరూ ఇంట్లోనే ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు తెలిపారు. బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులలో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి... ఒక వ్యక్తిని వికారాబాద్ చెస్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్స్ వాడాలని... ఎవరిపై అయినా అనుమానం వస్తే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకల్లా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలన్నారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'