ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల డిపోకు కార్మికులు తరలివచ్చారు. ముందుగా డిపో వద్ద అమరులైన కార్మికులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు. అనంతరం విధుల్లో చేరారు.
ఎలాంటి షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకోవడం సంతోషంగా ఉందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ముందు కంటే ఎక్కువ కష్టపడి... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిచే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది