రాష్ట్రంలో కరోనా విజృంభణ వేళ బాధితులను ఆదుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు వచ్చింది. 200 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో రాష్ట్రీయ విద్యా కేంద్రం-ఆర్‌వీకేను హోం ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. ఇక్కడ కరోనా రోగులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు తీసుకోవాల్సిన కషాయం, ఇతరత్ర మందులతో పాటు యోగా చేయిస్తున్నారు.
24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 65 మంది బాధితులు కోలుకుని ఇంటికి వెళ్లారు. వైద్యులు, సిబ్బంది, చికిత్స పొందుతున్న బాధితులు చప్పట్లు కొట్టి వీడ్కోలు పలుకుతున్నారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలందించిన వారికి కోలుకున్నవారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం